Posts

మన ప్యాషన్ మనకి బువ్వ పెట్టలేదా?

Image
"మన ప్యాషన్ మనకి బువ్వ పెట్టలేదా"?
(Passion అంటే అభిరుచి అని గూగుల్ చేసి మరీ ధ్రువీకరించుకున్న, కానీ ఎందుకో  Passion లో ఉండే ఇంటెన్సిటీ అభిరుచి అనే పదంలో అనిపించలేదు. అందుకే ఆ ఆంగ్లపదాన్ని వాడాల్సివచ్చింది. )
ఈ ప్రశ్న మొదట ఎపుడు మొదలైందో తెలీదో కానీ, దాని తీవ్రత ఎప్పటినుండి మొదలైందో మాత్రం గుర్తుంది- "సంపాదన  మొదలుపెట్టిన రోజు నుండి".  ఇప్పుడది నన్ను సీరియల్స్ని వదలని యాడ్స్ లాగా, RGV ని వదలని కాంట్రవర్సీ లాగ, ఇంకా చెప్పుకోలేని రక రకాలుగా సెకండుకో రకంగా చంపేస్తుంది. 

సరే అసలు దాని సంగతేంటో చూద్దామని అనుకున్నా,  ఆలా చూడాలంటే నా ప్యాషన్ ఏంటో తెలియాలిగా మొదట! ఏంటి.... ఏంటసలు.... ఏంటది... ఏంటని.. అహ ఏంటని సముద్రం ఒడ్డున కూచొని, సముద్రంలో మునిగి, లేచి, మల్లి ఒడ్డున మంచినీళ్లు తాగి, బీర్ తాగి, పోకేమన్ ఆడుతూ, సినిమా చూస్తూ, ఉద్యోగం చేస్తూ, తింటూ, ట్విట్టర్ వాడుతూ, ఇంస్టాగ్రామ్ చూస్తూ, ఫేస్బుక్ తెరిచి మూస్తూ , నడుస్తూ, జిమ్ చేస్తూ, జాగింగ్ మధ్యలో, నిద్రకి ముందు, నిద్రలో, మాటల మధ్యలో, రొయ్యల్ని క్యాంపు ఫైర్ లో పడేస్తూ, క్యాంపింగ్ టెంట్ పైన పారదర్శకంగా ఉండే పొర నుండి ఆకాశంలో చు…

"ఆకలేస్తే తింటాను. అలసిపొతే నిద్రపోతాను"

ఆకలేస్తే తింటాను. అలసిపొతే నిద్రపోతాను!

ఎప్పుడో ఒక జెన్ కథల పుస్తకంలో చదివినట్టు గుర్తు. ఈ సమాధానం చెప్పటం. జెన్ అంటే ఎమిటి అన్న శిష్యుడి ప్రశ్నకు, "ఆకలేస్తే తింటాను. అలసిపొతే నిద్రపోతాను" అని గురువు చెప్పాడంట. వినటానికి చాలా చిన్నదిగా అనిపించనా చాలా లోతైనది, ఈ కాలంలో ప్రపంచంలో 90 శాతం మంది అలా చేయలేని వారే ఉంటారేమో అనిపిస్తుంది.

ఇప్పుడు కష్టపడితే తర్వాత ఎప్పుడో సుఖపడచ్చు అని ఎవరు ఎప్పుడు ఏ సందర్భంలో  భోధించారో కానీ, ప్రతీ దానికి ఈ సిద్ధాంతాన్ని వాడేస్తుంటాం. కానీ నాతో నాకే ఎప్పుడూ పోరాటం. ఇప్పుడు కనిపించని ఎప్పటికోసమో, కళ్ళముందు కనిపిస్తున్న ఇప్పుడు కష్టపడాలంటే. ఆ కష్టపడటం శారీరికంగానే కాదు మానసికంగా కూడా. అందరూ చదివే చదువుతో, అందరు చేసే ఉద్యోగాలతో, అందరూ రాసే పోటీ పరీక్షలు రాస్తూ , అందరిలాగే, అందరికోసం, మన ఉనికిని అందరిలో పోగొట్టుకుంటూ అందరిలో ఒకటైపోతామేమో అని భయపడుతూనే ఎదో ఒకరోజు మనకి తెలియకుండానే ఒకటైపోయాక, ఏ పుస్తకాల్లోనో , సినిమాల్లోనో, మహేష్ బాబు లాంటి హీరో "నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో, నరులెవరు నడవనిది ఆ రూట్లో నడిచెదరో... నిండు చందురుడు ఒకవైపు చుక్కల…

మియామి- జులై 24.

Image

మియామి ప్రయాణం -1

Image
మియామి ప్రయాణం -1 జులై 13 ఉదయంఒంటరి ప్రయాణం మొట్ట మొదటి సారి అని భయం తోనో లేక ఉత్సాహం తోనో రాత్రంతా నిద్ర పట్టలేదు. పొద్దున ఎపుడో 6:30 కి నిద్రపోయి 9:00 కి లేచి కావాల్సినవన్నీ లిస్ట్ రాసి సిద్ధం చేయటానికి బయల్దేరాను. ఆ షాపు లోOut door Adventures కావాల్సిన అన్ని వస్తువులు ఉన్నాయి.  వాటిని చూస్తూనే సగం రోజు గడిపేసా. కావాల్సిన బాగ్, మన క్రెడిట్ కార్డ్స్ మన దగ్గర ఉండగానే స్కాన్ చేసుకొని వెళ్లిపోయే దొంగలనుండి రక్షణ గా ఏదో వాలెట్ ఉంది అని అక్కడ అమ్మే వాళ్ళు చెప్తే అది ఇంకా వగైరాలు. ఆకాశం నుండి మియామి: సాయంత్రం ఒక హడావిడి, ఇంకా ఫ్లైట్ మిస్ అయినట్టే అనుకున్న... నన్ను ద్రోప్ చేస్తా అన్న మిత్రుడు వచేసరికి ట్రాఫిక్ జామ్ .. ఫ్లైట్ 6:30 అంటే 6:00 కి సెక్యూరిటీ చెక్ దగ్గర ఉన్న... పేద్ద లైన్.. సరిగ్గా 6:30 కి న ఫ్లైట్ గతే దగ్గరకి పరుగులు పెట్టి వెళ్ళా. రాత్రి 9:30 కి నా రూం దగ్గరకి వెళ్లి అక్కడి వాళ్ళందర్నీ పరిచయాలు చేసుకున్న.. నేను తీసుకున్న రూం hindi movie Queen లో kangana ranaut తీస్కున్న రూంలా  ఉంటుంది. అంటే ఒక హాస్టల్ లాగా అనమాట . నాతో పాటు ఇద్దరు జెర్మనీ అమ్మాయిలు, ఒక న్యూ జిలాండ్ అమ్మాయి, ఒక …

నా ఒంటరి మియామి (ఫ్లోరిడా) ప్రయాణం

Image
         ఎప్పటినుండో ఒంటరిగా ప్రయాణించాలి అనేది ఒక To do list  లానే మిగిలిపోయింది. ఇప్పుడు ఎలాగూ ఉద్యోగం పోయింది, ఇక్కడ ఎటు పోవాలన్నా ఎండాకాలమే అనువైన సమయం తర్వాత చలి ఎలా ఉంటుందో చెప్పలేం, మరియు సమయం ఎలాగూ ఉంది. ఉద్యోగం రావటానికి సమయమూ పట్టేలా ఉంది.  ఏవేవో ఆలోచించి బుర్ర పాడవుతుంది ఎలా అబ్బా అనుకుంటూ ఉండగా అనుకోకుండా ఈ ఆలోచన మెదిలింది. ఒంటరి ప్రయాణం ఎలా ఉంటుందా అని.


        వెంటనే లాప్ టాప్ తీసి ఫ్లైట్ డిటైల్స్, డేట్లు , రేట్లు  అన్ని పరిశోధించి, అక్కడ ఉండటానికి రూమ్స్ వగైరా బుక్ చేసి పడేసి ఆవేశం లో. ఒక నాలుగు రోజుల ప్రయాణం. వీలైనప్పుడు అక్కడి విషయాలు, న ఒంటరి ప్రయాణం లో జరిగే పరిచయాలు గురించి మీతో పంచుకుని న మొట్ట మొదటి Travel journal entry పోస్ట్ చేయటానికి ఎదురు చూస్తూ ఉంటాను.

          ఇప్పుడు తెల్లవారు జాము 3:30 అయింది, రేపు సాయంత్రం 6:30 కి ఫ్లైటు. సర్దాల్సినవి ఎక్కడెక్కడ వెళ్లాలో ముందే చూస్కోవాల్సినవి చాలానే ఉన్నాయి, ఒంటరి ప్రయాణంలో అన్ని మనమేగా, కాస్త భయం ఉన్న కాస్త థ్రిల్ కూడా ఉంది. యాత్ర సుఖంగా కాకపోయినా థ్రిల్ ఉండాలని, థ్రిల్ ఉన్న కూడా సేఫ్ గా ఉండాలని కోరుకోండి. మియామి విశే…

పరిగెట్టి0చే జీవితం-ఆగి పొందాల్సిన ఆనందాలు

Image
                     మనకి ఎప్పుడూ పెద్ద పెద్ద ఆలోచనలు, గొప్ప గప్పగా బతకటాలు, వాటిలో ఉండే సుఖాల గురించి చెప్పే వాళ్ళు కుప్పల కుప్పలగా కనపడుతుంటారుకానీ... మన జీవితంలో జరిగే చిన్న చిన్న ఆనందాలని గుర్తించటం, వాటిని ఆనందంగా అనుభవించటం గురించి రోజవారీ పరిగు పందెంలో పడి మరచి పోయిన వారికి గుర్తుచేసే వాళ్ళు ఉండరు.. అలా గుర్తించే వాళ్ళని చిన్న చూపు చూసే వాళ్ళు ఉంటారేమో కానీ... 
                    బతకటం కోసం పరుగులు పెట్టటం నేర్పించిన దగ్గరనుండి, పరిగెట్టి పరిగెట్టి... పరిగెట్టటం ఆపేస్తే బతకలేమనే స్థితిని కల్పించి... అదే నిజంలా కనిపిస్తునప్పుడు పరుగు ఆపటం అనే ఆలోచన కూడా మన మనస్సు లోతుల్లో దాగిపోయేలా చేసి... ఇదంతా ఎందుకురా అంటే బతుకు చివరిలో ప్రశాంతంగా పరుగు లేకుండా ఉండటానికి అని చెప్పించి అదే నిజమని మనల్ని మనమే ఒప్పించి.... తీరా ఆరోజు వచ్చాక.. పరుగు తప్ప ఏమి తెలియదు మనకి అని.. పరుగులేకుండా ఎలా బతకాలో తెలియదని... ఆ పరుగులేని లోటు ని, ఆ సూన్యతని.. ఆ పరుగు లేని చంచల స్థితిని ఎలా అనుభవించాలో తెలియని స్థితికి వచ్చాక ఇంత పరిగెట్టి ఉపయోగం ఏంటి.
                 ఆరోజు రాకుండా ఉండాలంటే చిన్న చిన్న ఆనంద…